free web counter

Sunday, January 4, 2009

నీకోసం నాలోనా...

నీకోసం నాలోనా... ఎన్నెన్నో ఆశలు...
నాదైన నీ రూపం... ఇంకెంతో అభిమానం...
గడసరి పిల్లా... నీవు ఎక్కడున్నావని...
పదే పదే నా ప్రాణం... తల్లడిల్లి అడుగుతుంది...

నీకోసం నాలోనా... ఎన్నెన్నో ఆశలు...
నీడైనా నా రూపం... ఇంకెంతో అభిమానం...
--
శ్రావణ కుమారుడు

Thursday, January 1, 2009

కుశలమా... కుశలమా...

కుశలమా... కుశలమా...
ఓ ప్రియా... నీవు కుశలమా...
నీ నామమే నేను జపిస్తున్నాను...
నీ గానమే నేను విలపిస్తున్నాను...
నీ దివ్య రూపం కొరకు ఇలపై జీవిస్తున్నాను...

కుశలమా... కుశలమా...
ఓ ప్రియా... నీవు కుశలమా...
--
శ్రావణ కుమారుడు

Wednesday, November 26, 2008

ఏ గూటి పక్షులమో...

ఏ గూటి పక్షులమో మనము...
విద్య కోసమై ఈ గూటికి చేరాము...
మనస్సులోనా భావాలు మెదిలినా...
అవి మనస్సులోనే దాచేసుకున్నాము...
అంతరంగా అనురాగాలు మసలిన
అవి అంతరంగా భద్రం చేసుకున్నాము...

ఆ మనస్సులు కలవకుండానే
విడిపోతున్నాము...
ఆ మనస్సులు ఒక్కటవ్వక ముందే
విడిపోతున్నాము...
--
శ్రావణ కుమారుడు

ఎక్కడ ఉన్నావో...

ఎక్కడ ఉన్నావో... నీవు ఏంచేస్తున్నావో...
ఏమి నీ పేరో... ఏది నీ ఊరో...
ఈ దాగుడు మూతల ఆటలోన
ఎలా నిన్ను చూసేది... ఎలా నిన్ను వెతికేది...

ఆశలు ఉన్నాయంటే అడి ఆశలు అవుతాయేమోనంటూ...
కలలే కంటున్నా.. కనులారా చూస్తున్నా...
ఎన్ని యుగాలు గడిచిపోయిన
నీ కోసం నేనుంటా... నీ రాకకై వేచి చూస్తా...

ఎక్కడ ఉన్నావో... నీవు ఏంచేస్తున్నావో...
--
శ్రావణ కుమారుడు

కనిపించవే... కనిపించవే..

స్వాతి ముత్యమై సంధ్యకాంతిలో వెలిగావే...
సూర్య కిరణమై వెన్నెల కాంతిలో మెరిసావే...
మనస్సు మమతలు అల్లినట్లుగా పుట్టావే...
నా మనస్సును నీ మనస్సుతో కలిపావే...

కనిపించవే... కనిపించవే..
నేనున్నానని నాకు చెప్పవే...
--
శ్రావణ కుమారుడు

ప్రియతమా...

ప్రియతమా... నా ప్రాణమా...
నా గుండెలో చిరు కావ్యమా...
ప్రియతమా... నా ప్రాణమా...
నా గొంతులో తొలి రాగమా...
నా గుండె లయలను చిల్చుతున్న
నీవే ఒక బాణమా...
నా గొంతు లయలను పలకరిస్తున్న
నీవే ఒక స్వరమా...

ప్రియతమా... నా ప్రాణమా...
నా గుండెలో చిరు కావ్యమా...
--
శ్రావణ కుమారుడు

నేనున్నాను ఇక్కడ... నీవున్నది ఎక్కడ???

నేనున్నాను ఇక్కడ... నీవున్నది ఎక్కడ???
నేనేమో నీకోసం చూస్తుంటే...
గోదారిలా ఉరకలు వేస్తూ...
కావేరిలా పరుగులు తీస్తూ...
నీవేమో నాకోసం వస్తావనుకుంటే...
నా మనస్సేమో నీకోసం సతమతమౌతుంటే
కనులు మూస్తే నీవేమో ఎదురు ఉంటావు...
కనులు మూస్తే నీవేమో మాయమవుతావు...

నేనున్నాను ఇక్కడ... నీవున్నది ఎక్కడ???

నేనేమో నీరూపం కలలోనా చూసినా...
మరలేప్పుడు కానక చేసానే నీ జపం...
నా కళ్లు వెతుకుతున్నాయి నిన్నే నిన్నే ఎల్లప్పుడూ...

నేనున్నాను ఇక్కడ... నీవున్నది ఎక్కడ???
--
శ్రావణ కుమారుడు

జీవించగాలనా...

నీవు లేని లోకం లో జీవించగాలనా...
నీవు లేని నా జీవితం ఉహించగాలనా...
ఈ జన్మలో నేను నిన్ను చూడగలనా...
మరు జన్మ నాకుంటే... నీ తోడై ఉండనా...
కలకాలం నీకోసం నీనీడై బ్రతకనా...

నీవు లేని లోకం లో జీవించగాలనా...
--
శ్రావణ కుమారుడు

జన్మ జన్మల అనుబంధం...

నీ నవ్వుతో నాకు జన్మ జన్మల అనుబంధం
నీ నవ్వులో నాకు దొరికెను తియ్యటి సుమగంధం...
ఎన్ని జన్మలైన... ఎన్ని యుగాలైనా...
నీ నవ్వుకే నేను దాసోహం అవుతాను...
నీ నవ్వుకై నేను జీవిస్తూ ఉంటాను...

నీవు నవ్వితే... మదిలో పులగింత...
నీవు నవ్వితే... ఏదో గిలిగింత...
నీవు నవ్వితే... తియ్యటి కౌగిలింత...
నీవు నవ్వితే... నన్ను నేను మరిచేతంత...

నీ నవ్వుతో నాకు జన్మ జన్మల అనుబంధం
--
శ్రావణ కుమారుడు

నా చేతిలో ఏమ్మున్నదో...

నా చేతిలో ఏమున్నదో నీ చేతిని పట్టేందుకు...
నా మనస్సులో ఏమున్నదో నీ మనస్సును చేరేందుకు...
అనురాగమో... ఆప్యాయతో...
మన ఆత్మీయ అనురాగ బంధానికి...

నా చేతిలో ఏమున్నదో నీ చేతిని పట్టేందుకు...
--
శ్రావణ కుమారుడు

కానీ విని ఎరుగని...

కానీ విని ఎరుగని కన్యక...
మనస్సు తెలిసిన మల్లిక...
కాంతులు వెదజల్లే దీపిక...
మనస్సు దోచే ప్రేమిక...
ఆమె ఎవరని చెప్పాలి... ఎక్కడ ఉందని చెప్పాలి...
ఓ పావురమా... నివు తెలుపమ్మా...
ఆమె చిరునామా... నివు పలుకమ్మా...

ఆప్యాయతలో తల్లిగా... అనురాగంలో చెల్లిగా...
కష్టసుఖాలలో తానొక తోడుగా...
అనుక్షణం నాకొక నీడగా ఉండే...

ఆమె ఎవరని చెప్పాలి... ఎక్కడ ఉందని చెప్పాలి...
పావురమా... నివు తెలుపమ్మా...
ఆమె చిరునామా... నివు పలుకమ్మా...
--
శ్రావణ కుమారుడు

ఇలలోన కలలోనా...

ఇలలోన కలలోనా నీవే కనిపించావు...
నా గుండెలోతుల్లో నీవే దాగున్నావు...
నా కళ్ళలో నీవు నాట్యమాడుతున్నావు...
కనిపించవే ఓ సుకుమారి...
కనిపించవే ఓ దేవి మయూరి...

చూసాను నిన్ను నా గుండెలోనా
నీ రుపమెంతో విలువైనది...
ఆ విలువైన రూపం నాకు అందించవే...

ప్రేమించాను నిన్ను నా మనస్సులోనా
చెప్పాను నీకే తొలిసారి...
నా మాట వినవే సుకుమారి...
నా గోడు కానవే సుకుమారి...

ఇలలోన కలలోనా నీవే కనిపించావు...
--
శ్రావణ కుమారుడు

అమ్మ అని పిలిచే...

"అమ్మ" అని పిలిచే పిలుపు అందమే...
రావమ్మా అని పలికే పలుకు అందమే...
"అమ్మ" చేతిలో అనురాగం ఉంది...
"అమ్మ" ఒడిలో మమకారం ఉంది...
"అమ్మా" "అమ్మా" అంటూ నా ప్రాణమే...
--
శ్రావణ కుమారుడు

అమ్మ అను మాట...

అమ్మ అను మాట అందరినోట...
అమ్మ ప్రతి మాట మాకు పూదోట...

ప్రొద్దున్నే నిద్దురలేపి లాల పోసేది...
నా ముసి ముసి నవ్వులు తను చూసి
సంభరపడుతుండేది...
నా బుల్లి బుల్లి అడుగులు చూసి
చిన్ని కృష్ణుడు వస్తున్నడంటూ
మంచి మంచి కథలెన్నో నాకు చెప్పేది...
చందమామ ను చూపెడుతూ
గోరుముద్దలు అందిస్తూ
తన ఒడిలో నన్ను నిద్దురబుచ్చేది...
జోల పాడేది... అమ్మ జోల పాడేది...

అమ్మ అను మాట అందరినోట...
అమ్మ ప్రతి మాట మాకు పూదోట...
--
శ్రావణ కుమారుడు

ఆలి దైవమే...

మనిషిలో జీవాన్ని పోసే "అమ్మ" దైవమే...
మనస్సులోన భావాన్ని నింపే "ఆలి" కూడా దైవమే...
"అమ్మ"తో అనుబంధం కొద్దికాలమే...
"ఆలి"తో అనుబంధం జివితాంతమే...
"అమ్మ" స్థానం తరువాత మొదటి స్థానం "ఆలి"దే...
"ఆలి" లేని జీవితమే శూన్యమే...
"ఆలి" లేని జీవితమే వ్యర్ధమే...

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
మనకెన్నో సేవలు చేసేదే "ఆలి"
అందుకే ఆ పరమ శివుడు తన శరీరం లో
అర్ధ భాగాన్ని తన "ఆలి"కి ఇచ్చాడు
"ఆలి"లోని గొప్పతనం తెలుసుకో...
"ఆలి"తో అనుబంధం పెంచుకో...
--
శ్రావణ కుమారుడు

సింధూ సింధూ...

సింధూ సింధూ సింధూర పువ్వా
నాలో వేచే ఓ జాజి పువ్వా
మధురం నీ నామం ఓ మల్లె పువ్వా
నా కోసం వస్తావా ఓ కలువ పువ్వా
సింధూ సింధూ సింధూర పువ్వా
--
శ్రావణ కుమారుడు

Thursday, January 3, 2008

ఈ బ్లాగ్ గురించి...

ఈ బ్లాగ్ గురించి చెప్పేముందు నా హాభీల గురించి చెప్పాలి...
నా హాభీలుః పాటలు పాడటం, కవితలు వ్రాయటం, గార్డెనింగ్ చేయటం, వంటలు చేయటం, క్రికేట్ ఆడటం, ఇంటర్నెట్...

నేను వ్రాసే ప్రతి కవితలోను ఒక అందమైన తెలుగింటి అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కి నేను "సింధూరం" అని పేరు పెట్టుకున్నాను... ఈ బ్లాగ్ లో నా "సింధూరం" మీద నేను వ్రాసే కవితలు, నా మనస్సు పలికే మనోభావాలు పెట్టాలనుకుంటున్నాను...

Wednesday, January 2, 2008

ముందుగా నా గురించి...

నా పేరు శ్రావణ కుమార్ కరివేదల. మాది రాజమండ్రి దగ్గర చాగల్లు అనే ఒక పల్లెటూరు. నా చిన్నతనం అంతా మా ఊరులోనే. అక్కడే పదవ తరగతి వరకు చదువుకున్నాను. పదవ తరగతి లో నాకు మండలం లో మొదటి స్ఠానం వచ్చింది. దానికి గాను రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకము తీసుకున్నాను.

తరువాత పాలిటెక్నిక్ ప్రవేశ పరిక్ష వ్రాసి, అందులో మంచి ర్యాంక్ సాధించి ఎలెక్ట్రానిక్స్ మరియు కమ్యునికేషన్ లో డిప్లమా వైజాగ్ లో చేసాను. తరువాత ఇంజనీరింగ్ లో సీటు రాలేదు. 6 నెలలు కంఫ్యూటర్ హార్డ్ వేర్ రాజమండ్రి లో చేసాను. తరువాత హైదరబాద్ బి.ఎచ్.ఈ.ఎల్ లో అప్రంటీస్ గా చేరాను. అది చేస్తుంటేనే 6 నెలలు తరువాత ఇంజనీంగ్ లో సీటు వచింది. హైదరబాద్ దగ్గర భువనగిరి అనే ఊరిలో వాత్సల్య కళశాల లో ఇంఫర్మేషన్ అండ్ టెక్నాలజీ లో సీటు వచ్చింది. బి-టెక్ లో నేను క్లాసు టాపర్ ను. ఎన్నో ఒడిదుడుకులు పడుతూ నా ఇంజనీరింగ్ ను పూర్తి చేసాను. బి-టెక్ తరువాత ఉద్యోగం చేయాలి అనుకున్న నాకు 'గేట్ ' మంచి ర్యాంకు రావటం వలన ఐ.ఐ.టి ముంబాయి లో ఎమ్-టెక్ చేసే అవకాశమ వచ్చింది. ఇంట్లో కొంచం ఆర్ధికం గా ఇబ్బంది గా ఉన్న, మా నాన్న గారు చదువుకోమనటం తో ఐ.ఐ.టి ముంబాయి లో ఎమ్-టెక్ పూర్తి చేసాను. మా కాలేజి క్యాంపస్ ఇంటర్వ్యు లో నాకు బెంగుళూరు లో తేజస్ నెట్వర్క్స్ అనే కంపనీ లో సాఫ్టవేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం, బెంగుళూరు లో ఉద్యోగం చేస్తున్నాను.

మాది క్రైస్తవుల కుటుంబం. ఆ జీసస్ నా జీవితం లో ఎన్నో గొప్ప గొప్ప కార్యములు చేసారు. ఆయనే నిజమైన దేవుడు అని తెలుసుకోవటానికి నాకు చాలా కాలం పట్టింది. ఆ దేవుని కృపతో నా జీవితం లో ఉన్నతమైన స్థానలను అధిరోహించాలని ఆశ పడుతున్నాను...